రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్‌: రాజగోపాల్ రెడ్డి

67
komatiredy
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనపై రేవంత్ చేసిన ఆరోపణలను మగాడైతే నిరూపించాలన్నారు. బీజేపీ నుండి తనకు ఒక్క రూపాయి లబ్ది జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. లేదంటే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. తాను దేనికైనా సిద్ధమేనని.. రేవంత్‌ బహిరంగ చర్చ సిద్ధమేనా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

పీసీసీ పదవిని రేవంత్‌ డబ్బులతో కొన్నాడని…తెలంగాణలో పక్కా ప్లాన్‌ ప్రకారం టీడీపీని ఖతం చేశాడని ధ్వజమెత్తారు. పీసీసీ ప్రెసిడెంట్‌ అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్లాన్‌ చేసుకున్నాడని….సోనియాగాంధీని తానెప్పుడూ అవమానపర్చలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సోనియాను బలిదేవత అన్నది రేవంత్‌ ఒక్కడేనని అన్నారు.

నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని…వ్యాపారం చేయకుండానే ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని రేవంత్‌ను నిలదీశారు.

- Advertisement -