కాంగ్రెస్ నాయకుల హౌస్ అరెస్ట్…

59
revanth
- Advertisement -

దేశంలో పెరుగుతున్న చమురు ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ నేటి నుండి ఆందోళన బాటపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహాం నుండి ర్యాలీ చేపట్టి విద్యుత్ సౌధ ముట్టడించాలని నిర్ణయించగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

రాత్రి నుంచే కాంగ్రెస్‌ నేతల గృహ నిర్భందాలు, ముందస్తు అరెస్ట్‌లు జరుగుతున్నాయి. పార్టీ ముఖ్య నాయకులను హౌస్‌ రెస్ట్‌ చేశారు పోలీసులు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, దాసోజు శ్రవణ్‌ సహా పలువరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

అలాగే కేంద్రం పెంచుతూ పోతున్న ధరలకు నిరసనగా సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చింది. పార్టీ లో అనుబంధ సంఘాలు కిసాన్ కాంగ్రెస్ నేతలు సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యాలయం ముట్టడిలో పాల్గొనాలని నిర్ణయించారు.

- Advertisement -