సీఎం రేవంత్ రెడ్డిని నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కోసం రేవంత్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది హస్తం పార్టీ. ఇప్పటికే 7 రాష్ట్రాలు ఏపీ,కర్ణాటక,మహారాష్ట్ర,కేరళ,తమిళనాడు,బీహార్,గుజరాత్ రాష్ట్రాల నుండి ఆహ్వానం రాగా ఎన్నికల ప్రచారం కోసం వెళ్లనున్నారు రేవంత్.
ఈ నేపథ్యంలో ఆయన్ని నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే కేరళలో ఉన్న రేవంత్…రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజ పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ ప్రచారం చేయనున్నారు.
అలాగే తెలంగాణలో రేవంత్ 50 సభలు, 15 రోడ్ షో లకు ప్లాన్ చేస్తున్నారు. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలో రేవంత్ పాల్గొననున్నారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో కనీసం మూడు చోట్ల సీఎం సభలు నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
Also Read:Priyanka:బీజేపీకి 180 సీట్లు కూడా రావు