బిగ్ బాస్ 6..రేవంత్ విన్నర్

2684
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగిసింది. అంతా ఊహించినట్లే సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు. అయితే విజేతగా నిలిచిన రేవంత్‌కి 10 లక్షలు రాగా రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్‌కు 40 లక్షలు వచ్చాయి.

టాప్‌ 5లో ఉన్న ఒక్కొక్కరిని తప్పిస్తూ వచ్చారు నాగ్. చివరగా శ్రీహాన్ – రేవంత్‌ ఫైనల్ బరిలో నిలవగా వీరిద్దరి మధ్య టైటిల్‌ కోసం దోబుచులాట జరిగింది. తొలుత నాగ్‌ 30 లక్షల సూట్‌ కేసుతో హౌస్‌లోకి ఎంటరయ్యారు.

తర్వాత 30 లక్షలు కాస్తా 40 లక్షాలకు పెంచారు నాగార్జున. ఇక అంతా తీసుకో శ్రీహాన్ తీసుకో అంటూ అరుస్తూనే ఉాన్నారు. చివరిగా తీసుకోవాలో వద్దో మీరు చెప్పండి నాన్నా అని శ్రీహాన్ అడగటంతో.. తీసుకోమనే చెప్పారు. దీంతో శ్రీహాన్ ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోవడంతో రేవంత్ విన్నర్‌గా నిలిచాడు. ఇక గీతూ అయితే.. శ్రీహాన్ డబ్బులు తీసుకుంటేనే మంచిది అని సలహా ఇచ్చింది. అలాగే ఫైమా, రాజ్, సూర్యా అంతా కూడా శ్రీహాన్ నువ్వు తీసుకో… మీరు ఇద్దరూ హృదయాలనే గెలిచారు.. కానీ శ్రీహాన్ తీసుకోవడం మంచిది అని ప్రోత్సహించారు. మొత్తానికి అంతా ఊహించినట్లే రేవంత్‌ విన్నర్‌గా నిలిచి 106 రోజుల ఉత్కంఠకు తెరదించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -