కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తు నిర్ణయం తీసుకొని దాదాపు 47రోజులు కావస్తోంది. కాని పరిస్ధితిలు మాత్రం అలానే ఉన్నాయి. ఎక్కడ చూసిన బ్యాంక్‌లో క్యూలైన్లో కనిపిస్తున్నాయి. ఏటీఏంలో మాత్రం ఎనీటైం మనీలెస్‌గా మారాయి. డిసెంబర్ తర్వాత ఇలాంటి కష్టాలు ఉండబోవని మోడీ స్పష్టం చేశారు. అయిన పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త నోట్ల వల్ల కష్టాలు తగ్గాలి కాని మరింత పెరిగాయని ప్రజలు నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పైగా దీనికి తోడు నగద్ విత్‌డ్రాపై విధించిన పరిమితులు ప్రజలకు గుది బండగా మారాయి.
ఇటీవలే బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో నగదు విత్‌డ్రాపై విధించిన పరిమితులను డిసెంబర్ 30తో ఎత్తివేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఈరోజు ఈ వ్యవహారానికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ తర్వాత కూడా ఆంక్షలు ఇలానే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నోట్ల డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌ల్లో 2వేల నోట్ల ముద్రణను తగ్గించారు. 5వందల నోట్ల ముద్రణకు వేగం పెంచారు. అయినప్పటికీ ఇవి అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పట్టే అవకాశముందని సమాచారం.
చాలా మంది విత్‌డ్రా పరిమితులు పూర్తిగా తొలగిస్తారని భావిస్తున్నారని, కానీ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొంత ఉపశమనాన్ని కల్పించే ప్రయత్నాలే కేంద్రం నిర్వర్తిస్తోందని పబ్లిక్ సెక్టార్ పరిధిలోని ఓ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. అందులో భాగంగానే సర్ ఛార్జీల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన తెలిపారు. తాజాగా ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యలు కూడా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి.
బ్యాంకులు, ఏటీఎంల్లో తగినంత నగదు సమాకూర్చేదాక విత్‌డ్రాపై విధించిన పరిమితులు కొనసాగుతాయని ఆమె తెలిపారు. బ్యాంకుల్లో వారానికి 24వేలు, ఏటీఎంల్లో రోజుకు 2,500 రూపాయల వరకూ తీసుకోవాలని, అంతకు మించి అందుబాటులో ఉండవని ఆర్బీఐ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సంవత్సరం కూడా నోట్ల కష్టాలు తప్పవన మాట.