సైనికులకు సీఎం కేసీఆర్ వరాలు….

257
FORMER SOLDIERS DOUBLE BEDROOM HOUSE
- Advertisement -

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో కూడా సైనిక సంక్షేమ బోర్డులు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో సైనిక సంక్షేమ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర, జిల్లా స్థాయి లో ఉన్న సైనిక సంక్షేమ బోర్డులను మరింత బలోపేతం చేయాలని కేసీఆర్‌ చెప్పారు.

వరంగల్‌లో సైనిక స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించినందున దీనికి సంబంధించి వెంటనే ఎంవోయూ చేసుకోవాలని ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో మాజీ సైనికోద్యోగులు, సైనికాధికారులతో కలిసి భోజనం చేసిన సీఎం, తర్వాత వారి సమస్యలు, ఇబ్బందులను సావధానంగా విన్నారు. దాదాపు మూడుగంటలపాటు వారితో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రల కన్నా మెరుగ్గా రాష్ట్రంలోని సైనికోద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు. మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.

FORMER SOLDIERS DOUBLE BEDROOM HOUSE

రాష్ట్రంలో చేపట్టిన డబుల్‌బెడ్ రూమ్ పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు గురుకుల పాఠశాలల ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగే సైనికుల వాహనాలకు రాష్ట్రంలో లైఫ్‌ట్యాక్స్ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. యుద్ధంలో మరణించిన సైనికుల పేరిట గ్యాలంటరీ అవార్డుల ద్వారా ఇచ్చే పరిహారాన్ని మిగతా రాష్ట్రలన్నింటి కంటే తెలంగాణలో ఎక్కువగా ఉండేలా విధానం రూపొందించాలని ఆదేశించారు.

FORMER SOLDIERS DOUBLE BEDROOM HOUSE

మాజీ సైనికోద్యోగుల కుటుంబాల పెన్షన్‌లకు సంబంధించి సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షన్ పొందుతున్న మాజీ సైనికోద్యోగి మరణిస్తే అదేస్థాయి పెన్షన్‌ను అతడి భార్యకు వర్తింపచేయాలని, ప్రతినెలా దానికి ఇతర ఉద్యోగులతోపాటు చెల్లించాలని చెప్పారు. యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం,సదుపాయాలను సర్వీసులో ఉండి అనారోగ్యంతోగాని.. ప్రమాదవశాత్తుగాని మరణించిన సైనికుల కుటుంబాలకు కూడా వర్తింపచేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి వ్యత్యాసాన్ని చూపవద్దని ఆదేశించారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పనిచేస్తున్న మాజీ సైనికోద్యోగుల వేతనాలను ప్రతి నెలా ఇతర ఉద్యోగులతోపాటు విధిగా చెల్లించాలని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసే మాజీ సైనికులకు డబుల్ పెన్షన్, సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపుపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

FORMER SOLDIERS DOUBLE BEDROOM HOUSE

మిలిటరీ నిర్వహించే స్కూళ్లకు రాష్ట్ర గుర్తింపు ఇవ్వాలని, విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్‌సీసీ శిక్షణను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. సీఎం నిర్ణయాలపై మాజీ సైనికోద్యోగులు హర్షం ప్రకటించారు. అమర సైనికుల భార్యలకిచ్చే పెన్షన్‌ను రూ.6వేలకు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -