నూతన సంవత్సర వేడుకులకు నో పర్మిషన్‌!

35
new

కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ తెలిపారు.

ప్రజలు తమ ఇండ్లలోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని… ర్యాలీలు, గుంపులు గుంపులుగా గుమిగూడడం, వాహనాలపై తిరగడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా గుర్తించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మద్యం విక్రయ కేంద్రాలు నిర్ణీత సమయం దాటిన అనంతరం ఎవరుకూడ అమ్మకాలు నిర్వహించవద్దన్నారు.