GWMC ఎన్నికలు.. రిజ‌ర్వేష‌న్ల జాబితా విడుదల..

44

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌కారం ఇవాళ రిజ‌ర్వేష‌న్ల జాబితాను విడుద‌ల చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌రిధిలోని 66 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖరారు కాగా, 65వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు, 2వ డివిజ‌న్ ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజ‌న్లు ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 15, 17, 18, 37, 47, 53 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజ‌న్ల‌ను బీసీ మ‌హిళ‌ల‌కు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజ‌న్లు బీసీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63 డివిజ‌న్ల‌ను జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల‌కు కేటాయించారు.

66 డివిజన్లలోని 298 ప్రాంతాల్లో 878 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ స్టేషన్లలో 800 ఓట్లకు మించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరమే పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగకుండా పర్యవేక్షణకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందాలను ఎన్నికల అధికారి నియమించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వర కు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రతి బృందంలో తహసీల్లార్లు, ఇరిగేషన్‌ అధికారులు, పోలీస్‌ అధికారులు, వీడియో గ్రాఫర్‌ ఉంటారు.