రివ్యూ: రిపబ్లిక్

143
saidharam

మెగా హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ రిప‌బ్లిక్‌. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించగా సాయితేజ్ జోడీగా ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకురాగా ఈ సినిమాతో తేజ్ మెప్పించాడో లేదో చూద్దాం…

కథ:

ప్రపంచ ఖ్యాతి గడించిన తెల్లేరు సరస్సు… మూడు దశాబ్దాలు గడిచే సరికీ కబ్జాలకు గురవుతుంది. దీనికోసం కొంతమంది చేపలకు విషాహారాన్ని మేతగా వేయడంతో అక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని విశాఖ వాణి (రమ్యకృష్ణ) రాష్ట్ర పగ్గాలను చేపడుతుంది. సీన్ కట్ చేస్తే ప్రత్యేక అధికారాలతో ఆ ప్రాంతానికి కలెక్టర్ గా వచ్చిన పంజా అభిరామ్ (సాయి తేజ్) విశాఖ వాణికి ఎలా బుద్ధి చెప్పాడు? తదనంతర పరిణామాలు ఏమిటీ? అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, నటీనటులు,ఆలోచింప చేసే మాటలు, నిర్మాణ విలువలు. పంజా అభిరామ్ పాత్రలో సాయిధరమ్ మెప్పించాడు. సాయి తేజ్, జగపతిబాబు మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు మూవీకే హైలైట్. ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ మెప్పించింది. ఎన్నారై మహిళగా ఐశ్వర్యా రాజేశ్ చక్కగా సూట్ అయ్యింది. ఆమని, చేతన ,సుబ్బరాజు ,శ్రీకాంత్ అయ్యంగార్ ,మనోజ్ నందన్ ఆయా పాత్రలలో మెప్పించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సరస్సు చుట్టూనే తిరిగే కథ, క్లైమాక్స్‌.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. తాను రాసుకున్న కథను నిజాయితీగా తెరపై ప్రెజెంట్ చేశారు దర్శకుడు. కథ,నటీనటులు సినిమాకు ప్లస్ కాగా క్లైమాక్స్ మైనస్ పాయింట్స్‌. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ మూవీ రిపబ్లిక్.

విడుదల తేదీ:01/10/2021
రేటింగ్ : 2.5 / 5
నటీనటులు: సాయితేజ్, ఐశ్వ‌ర్యా రాజేశ్‌
సంగీతం: మణిశర్మ
నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు,
ద‌ర్శ‌క‌త్వం: దేవ్ క‌ట్టా