నవ్వండి..నవ్వించండి

81

నవ్వడం ఒక యోగం… నవ్వకపోవడం ఒక రోగం. ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేట్. మానసిక ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుంది. నవ్వడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు మటుమాయమవుతాయి. ఒక్క చిరునవ్వుతో అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

నవ్వుతో శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతాయని, ప్రపంచ శాంతే ఈ దినోత్సవ నిర్వహణ ముఖ్య ధ్యేయమని నిర్వాహకుల అభిప్రాయం.అందుకే నవ్వుల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్. జీవితంలో కష్టతరమైన యుద్ధాన్ని గెలవడానికి ప్రకాశవంతమైన చిరునవ్వు అవసరం. ఒక చిరునవ్వు మన చుట్టూ ఉండే పరిసరాలను వెలిగించగలదు. #చిరునవ్వు ఖర్చు లేని పని కానీ ఒక్క చిరునవ్వు తిరిగి ఎంతో ఇస్తుంది అని పేర్కొన్నారు సంతోష్‌.

ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే అతడు రోజుకు ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడో లెక్కిస్తే సరి. హాస్యం నవరసాల్లో ఒకటి. మితిమీరిన ఒత్తిడి, పోటీతత్వం, ఇలా అనేక సమస్యల వల్ల నవ్వడమే మర్చిపోయాం. కాసేపు నలుగురితో కలిసి హాయిగా గడపలేకపోవడం కూడా ఓ కారణం. నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా ఉండేవారు కూడా అరుదు. అందుకే సజీవమైన నవ్వులతో తొణికిసలాడే వారే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు. అందుకే ఒకే ఒక చిరునవ్వుతో జీవితాన్ని హాయిగా మార్చుకోండి.