దేశాన్ని పాలించే వ్యక్తులు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన పోచారం..రాజ్యాంగం కులం, మతాలది కాదు.. ఒక గ్రంథం లాంటిదని చెప్పారు. రాజకీయ పార్టీలు విమర్శలకే పరిమితం కావొద్దని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని, మైకులు అందగానే ఆరోపణలు చేయొద్దని సూచించారు.
మండలిలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉన్నత బాధ్యతల్లో ఉన్నవాళ్లు తెలంగాణ అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేవారు కేంద్రం ఏం చేసిందో కూడా చెప్పాల్సి ఉంటుందన్నారు. కేంద్రం ఏం చేసిందని అడిగితే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు.
74 ఏండ్ల తర్వాత కూడా పేదలు ఉన్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతుందన్నారు.
ఇవి కూడా చదవండి..