ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా..

279
Renuka-Chowdhury
- Advertisement -

సుదీర్ఘ మంతనాల అనంతరం ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటివరకు అన్ని పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒక్క ఖమ్మం సీటును మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఈ స్ధానం నుండి ఎవరు పోటీచేస్తారు అన్నదానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా పొంగులేటి సుధాకర్ రెడ్డి,గాయత్రి గ్రానైట్స్ అధినేత వృద్ధిరాజు రవిచంద్రకు సీటు దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ సీనియారిటికే ప్రిపరెన్స్ ఇచ్చింది కాంగ్రెస్‌ హైకమాండ్.

కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రేణుకా ఈసారి ఖమ్మం టికెట్‌ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగ అని ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పదవులు వచ్చినవాళ్లు చాలా పెద్దగా ఊహించుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చురకలించారు.

ఖమ్మం రాజకీయాల్లో రేణుకా తనదైన ముద్రవేశారు . ఖమ్మం ఎంపీగా రెండు సార్లు,రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన రేణుకా మన్మోహన్,దేవేగౌడ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్నారు.

- Advertisement -