పవన్‌కు కేటీఆర్ కౌంటర్‌..

293
ktr pawan
- Advertisement -

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తన నామినేషన్ సందర్భంగా జనసేన అధినేత,పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆంధ్రా వాళ్లను కొడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పవన్ అనవసరమైన వ్యతిరేకతను పెంచుతాయని హితవు పలికారు.ఇవి మీ ఆలోచనలకు సరికాని వ్యాఖ్యలని కేటీఆర్ తెలిపారు. మీరు నా అభిప్రాయంతో తప్పకుండా ఏకీభవిస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు అనవసరంగా వ్యతిరేకతను పెంచుతాయని పవన్‌కు కేటీఆర్ సూచించారు.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి 29 రాష్ట్రాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి తెలంగాణలో ఉంటున్నారనే విషయం మీకు తెలుసని కేటీఆర్ ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏపీ ప్రజలు. సర్ మేం ఆంధ్రావాళ్లం. కానీ హైదరాబాద్‌లో హ్యాపీగా ఉంటున్నాం అని ట్వీట్లు పెడుతున్నారు. మొత్తంగా ఎన్నికల వేళ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

https://twitter.com/KTRTRS/status/1109118684101001217

- Advertisement -