టైగర్ నాగేశ్వరరావు నుంచి తప్పుకున్న రేణు..?

507
renu desai
- Advertisement -

అల్లుడు శీను తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. స్పీడున్నోడు, జయ జానకీ నాయకా, సాక్ష్యం, కవచం సినిమాలతో మెప్పించిన బెల్లంకొండ ప్రస్తుతం రాక్షసుడు సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీ చేస్తుండగా కిట్టు  ఉన్నాడు జాగ్రత్త దర్శకుడు వంశీకృష్ణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.  ఇందులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నానని రేణు ఇటీవల స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇండియన్ రాబిన్‌హుడ్‌గా పేరుమోశారు టైగర్ నాగేశ్వరరావు .స్టువర్ట్‌పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు 70వ దశకంలో దోపిడీలు, దొంగతనాలు చేస్తే పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆయన పేరు చెబితేనే పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేవి. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -