Pawan Vs Ambati:రేణు షాకింగ్ కామెంట్స్

46
- Advertisement -

ఏపీ రాజకీయాలు వైసీపీ వర్సెస్ జనసేనగా మారిన సంగతి తెలిసిందే. బ్రో మూవీలో మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ తీసిన సీనే ఈ గొడవకు అసలు కారణం. దీంతో పవన్‌పై MRO సినిమా తీస్తానని అంబటి ప్రకటించగా పవన్ అభిమానాలు సందులో సింగరాల శ్యాంబాబు(SSS)సినిమాని అనౌన్స్ చేసేశారు. అయితే అంబటి ఒకడగు ముందుకేసి పవన్ పర్సనల్ లైఫ్‌తో వెబ్ సిరీస్ తీస్తానని ప్రకటించగా దీనిపై స్పందించారు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.

ప్రతి విషయంలో వ్యక్తిగత జీవితాన్ని లాగొద్దు అని పెళ్లిళ్ల పై చర్చ ఆపాలని వాటిలో తన పిల్లల్నే కాదు వేరే ఎవరిని కూడా లాగొద్దని చెప్పారు. ఇది ఓ తల్లిగా పర్శనల్ రిక్వెస్ట్ చేస్తున్నానని…. వాళ్ళు ఇంకా పిల్లలు అని వారిని దయచేసి ఈ విషయాల్లో లాగొద్దని తెలిపారు. నా మాజీ భర్తకి పొలిటికల్ పరంగా ఎప్పటికీ సపోర్ట్ చేస్తానని సమాజానికి ఏదోకటి చేయాలని తాను ఎప్పుడు తాపత్రయం పడుతూ ఉంటాడని పవన్‌ని ప్రశంసించారు.

పవన్‌కి డబ్బు మీద ఎలాంటి మోజు లేదని…అందరు తనకి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. ఇప్పుడు రేణు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

- Advertisement -