పవన్ ను మర్చిపోలేక పోతున్న రేణూ

196
RENU DESAI
- Advertisement -

రేణూదేశాయ్ ఈ పేరు అందరికి సుపరిచితమే.. మళ్లీ ఆమె గురించిచెప్పనక్కర్లేదు. వెండి తెరలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నటిగా మాత్రమే కాకుండా, ఒక దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో, పవన్ అభిమానులతో తన సందేశాల్ని పంచుకుంటుంది. ఇక ఇప్పుడు రేణూ దేశాయ్ బుల్లితెర లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా ఆమెకు సైతం స్టార్ ఇమేజీ ఉండేది.

RENU PAWAN

అయితే పవన్ తో విడిపోయాక కొన్నేళ్లుగా ఆమె పుణెలో తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది. పవన్ కల్యాణ్ నుండి విడిపోయాక కూడా ఆమె ఆయన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నానని పలుమార్లు చెప్పింది రేణూదేశాయ్. పవన్ కల్యాణ్ కు దూరంగా ఉంటున్నా కూడా రేణూదేశాయ్ ను పవన్ అభిమానులు ఇంకా వదినగానే భావిస్తున్నారు. అయితే రేణూదేశాయ్ తెలుగులో ప్రసారమవుతున్న  ఓ టీవీ డ్యాన్స్ షోలో జడ్జీగా చేస్తోంది.ఈ కార్యక్రమంలో పార్టిసిపెంట్ పవన్ కల్యాణ్ పాటకు డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్స్ ను చూస్తున్న రేణూ దేశాయ్ పవన్ తో తనకున్న బంధాలను గుర్తుకు తెచ్చుకుంది. పవన్ డైలాగులకు చప్పట్లు కొట్టింది.. హ్యాపీగా ఫీలయింది.

Pawankalyan renudesai

అంతే కాకుండా పవన్ ను ఇమిటేట్ చేసింది రేణూ దేశాయ్. పవన్ కల్యాణ్ అంటే ఆయన స్థాయి వేరని ఆయనలో ఉన్న ఎనర్జీలో 10 శాతం కూడా చేయలేదని జడ్జీమెంట్ ఇచ్చింది రేణూదేశాయ్. మొత్తానికి రేణూదేశాయ్ కు పవన్ పై ప్రేమ తగ్గలేదని పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -