రవితేజ మూవీలో రేణు దేశాయ్..!

112
- Advertisement -

టాలీవుడ్ హీరో మాస్‌ మహారాజా రవితేజ జయపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వాటిలో ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రం ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా సమాచారం. ఇందులో రవితేజ సోదరి పాత్రలో రేణు కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పాత్ర గురించి రేణుతో చర్చలు కూడా జరిపారట. త్వరలో దీనిపై క్లారిటీ రావాల్సివుంది.

వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా, ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’ చిత్రంతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

- Advertisement -