పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి కలిసిన బండి సంజయ్..

120
- Advertisement -

గత ప్రభుత్వాలలో పద్మశ్రీ అవార్డు పొందాలంటే రాజకీయ నేతలు క్షేత్రస్థాయిలో రిమైండర్ చేసే వాళ్ళని వాపోయారు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్… నరేంద్ర మోడీ సర్కార్‌లో నైపుణ్యమైన కళాకారుల గురించి పద్మ అవార్డుల ఎంపిక చేసిందన్నారు ఆయన. ఈరోజు బేగంపేటలోని పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి, తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సంగప్ప తదితరులు పద్మజారెడ్డి సన్మానం చేశారు.

ఈ సందర్భంగా జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి మాట్లాడుతూ.. పద్మ అవార్డులు పొందిన దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, భారత్ బయోటెక్ అధినేత క్రిష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లు తెలిపారు.పద్మ అవార్డులు పొందిన తెలంగాణ వారందరిని స్వయంగా కలిసి అభినందనలు తెలియజేస్తాం అని తెలిపారు సంజయ్.

- Advertisement -