అఖిరా పై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

25
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో నటి రేణూదేశాయ్ మళ్లీ వెండితెరపై మెరవనుంది. ఈ సినిమాలో ఆమె జాషువా కూమార్తె ‘హేమలత లవణం’గా కనిపించబోతున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమె.. తన రీ ఎంట్రీపై స్పందించారు. దర్శక, నిర్మాతల వల్లే ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నానని తెలిపారు. ఏదో జన్మలో పుణ్యం వల్లే ఈ పాత్ర పోషించే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చింది. అలాగే అఖీరాపై కూడా రేణు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు అఖీరా ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ప‌వ‌న్ ఫ్యాన్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ విష‌యంపై రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అఖీరాకు యాక్ట‌ర్ అవ్వాల‌నే ఇంట్రెస్ట్ లేద‌ని, ప్ర‌స్తుతం అత‌ను మ్యూజిక్, ప్రొడ‌క్ష‌న్ కోర్స్‌లు నేర్చుకుంటున్నాడ‌ని తెలిపింది. అఖీరాను న‌టుడుగా చేయాల‌ని ప‌వ‌న్ కానీ, త‌ను కానీ ఫోర్స్ చేయ‌డం లేద‌ని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ద‌స‌రాకు రిలీజ్ కానున్న సినిమాల్లో ర‌వితేజ‌ హీరోగా న‌టించిన ఈ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అక్టోబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేశారు.

ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేక‌ర్స్. హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేదిక‌లో ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. అన్నట్టు ఈ టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ సమయంలో మాస్ మహారాజా రవితేజ తీవ్రంగా గాయపడ్డాడని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. దోపిడీ సీన్‌లో ట్రైన్ మీది నుంచి లోపలికి దూకే షాట్‌లో రవితేజ అదుపుతప్పి కిందపడి, మోకాలికిపైన బాగా దెబ్బ తగిలిందన్నారు. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారని అన్నారు. అయితే రవితేజ రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయారని చెప్పారు.

Also Read:సైంధవ్ రైట్స్ భారీ రేటుకి!

- Advertisement -