తలనొప్పి తగ్గించే చిట్కాలు..

98
- Advertisement -

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా తలనొప్పి రావడం సర్వ సాధారంణంగా మారింది. పనిలో ఒత్తిడి ఎక్కువ కావడంతో చాలా మందకి తలనొప్పి భారినపడతారు. ఈతలనొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలాగే మరికొంత మంది అద్దాలు వాడుతారు. కొంత మందికి టెన్షన్ ల వల్ల తలనొప్పి వస్తే మరికొంత మందికి పనిలో ఒత్తిడి ఎక్కువవడంతో తలనొప్పులు వస్తుంటాయి. మందులు వాడటం వల్ల చాలా వరకూ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని మనకు తెలిసిందే. ఈమధ్య చిన్నపిల్లలకు కూడా విపరీతమైన తలనొప్పి రావడం మనం చూస్తుంటాం. అయితే తలనొప్పి బారి నుంచి తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం…

ఎక్కువగా తలనొప్పి వచ్చినపుడు ఆవుపాలు వేడిచేసుకుని తాగితే తలనొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అంతేకాకుండా భోజనంలో నెయ్యి కలుపుకుని తింటే కూడా తలనొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి. గంధపు చెక్కపై నీళ్ల చుక్క వేసి రాయి మీద రుద్ది పేస్టులాంటి గంధం తీయాలి. దీన్ని నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమం తాగడం వల్ల నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ చిట్కా చాలా తలనొప్పులకు పనిచేస్తుంది. ఎందుకంటే తలనొప్పులు చాలా వరకు కడుపులో గ్యాస్ చేరడం వల్ల వస్తాయి. ఈ మిశ్రమం కడుపులోని గ్యాస్‌తోపాటు, తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఉదయం నిద్ర లేవగానే ఒక ఆపిల్ ముక్కకు ఉప్పు రాసుకొని తినాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్లు లేదా పాలు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా పదిరోజుల పాటు చేస్తే ఎప్పటినుంచో వేధిస్తున్న తలనొప్పి కూడా తగ్గిపోతుంది.తలనొప్పి తగ్గించుకోవడానికి మరో మార్గం తలకు యూకలిప్టస్ తైలంతో మర్దన చేయడం. ఎందుకంటే యూకలిప్టస్ మంచి నొప్పి నివారణి.తలకు కొబ్బరి నూనెతో 10, 15 నిమిషాల పాటు మర్ధనా చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవిలో వచ్చే తలనొప్పికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది.బాదం నూనె వెచ్చబెట్టి 15 నిమిషాల పాటు తలకు మర్థన చేస్తె తలనొప్పి తగ్గిపోతుంది.

 Also Read:బెదిరింపులతో పార్టీ ఫిరాయింపులు:బీజేపీ

- Advertisement -