ప్రస్తుతం ఒక భాషలో రిలీజైన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఓ రీమేక్ పట్టుకొని వేలాడుతున్నాయి. ఇప్పటికే తమిళ్ లో సూపర్ హిట్టైన రక్షాషన్ ను తెలుగు రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు బెల్లంకొండ.
కొన్నేళ్ల క్రితం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రాజమౌళి ఛత్రపతి ను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ను తీసుకున్నారు. పెన్ మూవీస్ అనే బిగ్ ప్రొడక్షన్ హౌజ్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది.
అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజిలో ఉండిపోయింది. అసలు రిలీజ్ అవుతుందా ? లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. దీనికి బ్రేకులు, బ్రేకులుగా షూటింగ్ జరగడం, ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడం, రిలీజ్ పై క్లారిటీ ఇవ్వకపోవడం ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్ పై బోలెడు సందేహాలు క్రియేట్ చేస్తున్నాయి. కొందరైతే ఈ రీమేక్ అగిపోయినట్టే అంటున్నారు. వీవీ వినాయక్ కూడా చిన్నా చితకా ప్రెస్ మీట్స్ కి గెస్ట్ గా అటెండ్ అవుతూ కాలం గడుపుతున్నాడు తప్ప ఛత్రపతి రీమేక్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. బహుశా వినాయక్ కి కూడా ఎలాంటి క్లారిటీ లేదేమో ?
ఇవి కూడా చదవండి..