బాలీవుడ్ ని దెబ్బతీస్తున్న రీమేక్స్

53
- Advertisement -

కొన్నేళ్ళుగా బాలీవుడ్ హిట్ రేషియో తక్కువైంది. కోవిడ్ తర్వాత పఠాన్ కి ముందు వరకు బాలీవుడ్ లో సాలిడ్ హిట్ లేదు. షారూఖ్ ఖాన్ నాలుగేళ్ళు వెయిట్ చేసి సాలిడ్ హిట్ ఇచ్చి బాలీవుడ్ లో మళ్ళీ సరికొత్త నంబర్స్ సృష్టించాడు. పఠాన్ 1000 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ లో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. ఇక నుండి వరుస హిట్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ దద్దరిల్లుతుందని అందరూ అనుకున్నారు. కానీ రెండు రీమేక్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఊహించని విధంగా దెబ్బ తీశాయి.

అందులో ఒకటి షేజాద. తెలుగులో భారీ వసూళ్లు అందుకున్న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా సాధారణ ఓపెనింగ్స్ కూడా అందుకోలేక పోయింది. రిజల్ట్ కూడా తేడా కొట్టడంతో అక్కడ ఫ్లాప్ అనిపించుకుంది. ఇక అక్షయ్ కుమార్ కూడా తాజాగా ఓ రీమేక్ తో బాలీవుడ్ ఆడియన్స్ ముందుకొచ్చాడు. మలయాళంలో వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ ను హిందీ లో ‘సెల్ఫీ’ టైటిల్ తో రీమేక్ చేశాడు అక్షయ్.

హీరోకి అభిమానికి మధ్య వచ్చే ఇగో క్లాష్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో డిజాస్టర్స్ అనిపించుకుంది. అక్షయ్ కుమార్ కి కొన్నేళ్ళుగా సరైన హిట్ లేకపోవడంతో మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీంతో ఈ సినిమా బాలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుంది. పఠాన్ తో మళ్ళీ బాలీవుడ్ బాక్సాఫీస్ కి భారీ ఊపొస్తే , ఈ రెండు రీమేక్స్ బాగా దెబ్బ తీశాయి. మరి పఠాన్ తర్వాత ఆ రేంజ్ హిట్ బాలీవుడ్ కి వచ్చేడెప్పుడో ?

ఇవి కూడా చదవండి..

- Advertisement -