పోక్సో కేసులో యడియూరప్పకు రిలీఫ్

16
- Advertisement -

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు బిగ్ రిలీఫ్. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఫిబ్రవరి, 2024లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. అయితే పోక్సో కేసును శాశ్వతంగా కొట్టివేయడానికి నిరాకరించింది న్యాయస్థానం.

కేసుకు సంబంధించిన పిటిషన్‌పై జనవరి 17న వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై కేసు నమోదైంది. గతేడాది ఫిబ్రవరిలో బెంగళూరులోని తన నివాసంలో యడ్యూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు మార్చి 14, 2024న సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణను సీఐడీకి బదిలీ చేసి, సీఐడీ మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

Also Read:బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?

- Advertisement -