దండె విఠల్‌కు రిలీఫ్..

16
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జులై నెలకు వాయిదా వేసింది. ఎమ్మెల్సీగా విఠల్​ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుండి గెలిచారు విఠల్. ఫోర్జరీ సంతకాలతో దండె విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాను నామినేషన్‌ను ఉససంహరించుకోలేదని, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు..విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు విఠల్…తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది.

Also Read:ఐరన్ లోపమా..జాగ్రత్త?

- Advertisement -