మణిక్‌రావ్‌ కోకటేకు సుప్రీంలో రిలీఫ్..!

5
- Advertisement -

చీటింగ్‌, ఫోర్జరీ కేసులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత మణిక్‌రావు కోకటేకు సుప్రీంకోర్టు కీలక ఊరట కల్పించింది. ఈ కేసులో ఆయనపై విధించిన దోషసిద్ధిని సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. అలాగే మహారాష్ట్ర శాసనసభ సభ్యత్వం నుంచి అనర్హతను కూడా కోర్టు స్టే చేసింది.

1995లో జరిగిన మోసపు కేసులో కోకటేకు విధించిన శిక్షను నిలిపివేయాలన్న అభ్యర్థనను బొంబాయి హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ను సుప్రీంకోర్టు విచారించింది.చీఫ్ జస్టిస్ సూర్య కాంత్‌, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్న వెకేషన్ బెంచ్‌ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు జారీ చేయాలి. తదుపరి విచారణ వరకు పిటిషనర్‌పై విధించిన దోషసిద్ధి అమలు నిలిపివేయబడుతుంది. దాంతో పాటు శాసనసభ సభ్యుడిగా ఆయనపై ఉండే అనర్హత కూడా ఉండదు. అయితే, ఆయన లాభదాయకమైన ఎలాంటి ప్రభుత్వ పదవిని మాత్రం చేపట్టకూడదు అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వులతో మణిక్‌రావ్‌ కోకటేకు పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే కేసుపై తుది తీర్పు వచ్చే వరకు ఆయనపై కొన్ని పరిమితులు కొనసాగుతాయని కోర్టు స్పష్టంచేసింది.

Also Read:‘ధురంధర్’..ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -