- Advertisement -
కరోనా సంక్షోభంలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్,అంబానీల ఆదాయం తగ్గడం లేదు. 2020-21 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి ముకేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ఐఎల్ నికర లాభం 12 శాతం వృద్ధి చెంది ఆదాయం రూ.13,101 కోట్లకు చేరుకుంది.
గత ఏడాది మార్చిలో రిలయన్స్ స్థూల రుణ భారం రూ.3,36,294 కోట్లుగా ఉంటే అదే డిసెంబర్ చివరి నాటికి రూ.2,57,413 కోట్లకు తగ్గింది. నగదు నిల్వలు రూ.1,75,259 కోట్ల నుంచి రూ.2,20,524 కోట్లకు పెరిగినట్టు రిలయన్స్ ప్రకటించింది.
రిలయన్స్ రిటైల్, జియో వ్యాపారాల జోరుతో పాటు ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ) బిజినెస్ బాగా కలిసివచ్చింది. దీంతో.. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,640 కోట్లుగా ఉన్న ఆర్‌ఐఎల్ నికర లాభం.. ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది.
- Advertisement -