2017 మార్చి 31 వరకు జియో ఫ్రీ..

107
march31st jio free

జియో వినియోగదారులకు రిలయన్స్ అధినేత ముకేష్‌ అంబానీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించాడు. డిసెంబర్ 31 వరకు ఉన్న అపరిమిత ఉచిత కాలింగ్..ఫ్రీ డేటా సౌకర్యాన్ని మార్చి 31 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించాడు.  ఈ రోజు ముంబయిలో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో సేవలు ఉచితంగా ల‌భిస్తాయ‌ని ప్ర‌క‌టించారు. అంతేగాక‌, నెంబరు పోర్టబులిటీని స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ నెల 31 నుంచి దేశంలోని 100 న‌గ‌రాల్లో వినియోగ‌దారులు ఆర్డ‌ర్ చేసుకుంటే ఇంటి వ‌ద్ద‌కే జియో సిమ్‌ను పంపే సౌల‌భ్యాన్ని తీసుకొస్తున్నామ‌ని చెప్పారు.

Reliance-Jio-SIM-Cards

ఇప్ప‌టివ‌ర‌కు 5 కోట్ల మంది జియో సిమ్‌ను తీసుకున్నార‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ కంటే వేగంగా జియో అభివృద్ధి చెందుతోందని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తెలిపారు.అత్యంత వేగంగా సాంకేతికతను అందించే సంస్థగా జియో నిలవడం గర్వకారణమని.. ఇది తమ ఖాతాదారుల విజయమని పేర్కొన్నారు. జియోను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని.. వీరి కోసం వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో అన్ని సేవలు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు అంబానీ తెలిపారు.

కాగిత రహిత సమాజం కోసం జియోను తీసుకొచ్చాం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ జియో ఉచిత సేవలను పొడిగిస్తామని చెప్పారు. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద ఈ ఉచిత సేవలు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. జియో వినియోగదారులకు మిగతా నెట్వర్క్లు సహకరించడం లేదని ముఖేష్ అంబానీ ఆరోపించారు. సంచలమైన ఆఫర్లతో సెప్టెంబర్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులు డిసెంబర్ 4తో ముగియనున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలలు అంటే మార్చి 31వరకు ఈ సేవలను ఉచితంగా వాడుకోవచ్చని గురువారం ముఖేష్ అంబానీ తెలిపారు.

ఆయన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు:

  • 2017 మార్చి 31 వరకూ డేటా, వాయిస్ కాల్స్ అన్నీ ఫ్రీ
  • ఆధార్ ఆధారంగా 5 నిమిషాల్లో  జియో సిమ్ యాక్టివేషన్
  • కాల్  డ్రాప్  సమస్యల 90 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది.
  • హ్యాపీ న్యూయర్ ప్లాన్‌తో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ
  • ప్రతి రోజూ 1 జిబి వరకూ ఉచితంగా వాడుకోవచ్చు
  • 2016 డిసెంబర్ 4 నుంచి 2017 మార్చి 31 వరకూ ఫ్రీ
  • కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లకి వర్తించే జియో ఆఫర్
  • జియో మనీతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్