రిలయన్స్ జియో సేవలతో టెలికాం మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ముఖేష్ అంబానీ వినియోగదారులకు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తామని ముకేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా తన కస్టమర్లందరికీ 4జీ డేటా, వాయిస్ కాల్స్‌ను అందరికీ ఉచితంగా ఇస్తున్న రిలయన్స్ జియో… ఈ ఉచిత సేవలు డిసెంబర్ 31 వరకు అందచేస్తామని తెలిపింది. దీని ప్రకారం ఇంకో నెల రోజులు మాత్రమే జీయో ఉచిత సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అయితే జియో వెల్‌కమ్ ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు జియో అప్పట్లో ప్రకటించింది. అంటే మార్చి 2017 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జియో వెల్‌కమ్ ఆఫర్‌ను 2017 డిసెంబర్ వరకు పొడగించనున్నట్టు సమాచారం.
ఈ ఆఫర్ గడువు ఇంకో నెలలో ముగుస్తుందనుకుంటున్న నేపథ్యంలో.. డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఈ ఆఫర్ పొడిగింపు ప్రకటన ఉంటుందని అప్పుడే వార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడున్న ఉచిత సర్వీస్‌తో పాటు వెల్‌కమ్ ఆఫర్ కూడా 2017 సంవత్సరం చివరి వరకు ఉంటుందని అంటున్నారు. మరీ ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే డిసెంబర్ 28 వరకు ఆగాల్సిందే. కాగా, దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
ఇక ‘జియో’ ఆఫర్ కేవలం 4జీ వినియోగదారులకు మాత్రమే. కానీ అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కాం కేవలం రూ.149 రీచార్జ్‌తో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేసుకోవడంతో పాటు ఉచితంగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని ఇటీవలే ప్రకటించింది. అయితే ఆర్‌కాం ఆఫర్‌ను 2జీ, 3జీ, 4జీ వినియోగదారులందరూ వాడుకోవచ్చు.