ఈ జియో రిఛార్జీలు తెలుసా..?

161
Inspired by Jio's unlimited plan, Gujarat pani puri vendor offers unlimited golgappas for Rs100
- Advertisement -

మొత్తం టెలికాం ఇండస్ట్రీనే ఓ ఆట ఆడుకున్న రిలయన్స్ జియో రూ.309, రూ.399 ప్లాన్ల గురించే చాలా మందికి తెలుసు. అయితే వినియోగదారులకు పనికొచ్చే పలు ఇతర ప్లాన్లు కూడా జియోలో ఉన్నాయి. రూ.11, రూ.51, రూ.91, రూ.201, రూ. 301 ప్లాన్లు వినియోగదారులకు జియోలో అందుబాటులో ఉన్నాయి. రూ.11తో రీచార్జి చేసుకుంటే 100 ఎంబీ డేటా వస్తుంది. 35 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. అదే రూ.51తో రీచార్జి చేసుకుంటే 1 జీబీ డేటా లభిస్తుంది. 175 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రూ.91 రీచార్జితో 2 జీబీ డేటా, 325 నిమిషాల వాయిస్ కాల్స్ వస్తాయి. రూ.201తో 5 జీబీ డేటా, 725 నిమిషాల వాయిస్ కాల్స్, రూ.301తో 10 జీబీ డేటా, 1000 నిమిషాల వాయిస్ కాల్స్ వస్తాయి. అయితే వీటి వివరాలను జియో తన సైట్‌లో ఇవ్వలేదు. కానీ ఈ ప్యాక్‌లను పేటీఎం వంటి సైట్లలో రీచార్జి చేసుకోవచ్చు.

ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నేటి నుంచే మార్కెట్ లోకి రానుంది. దాదాపు 60 లక్షల కస్టమర్లకు రాబోయే 15రోజుల్లో వినియోగదారులకు అందించనుంది జియో. ఇక సింగిల్‌ సిమ్‌తో వస్తున్న జియో ఫోన్‌లో హాట్‌స్పాట్‌ ఫీచర్‌ అందుబాటులోలేకపోవడం కస్టమర్లకు కొంత అసంతృప్తిని గురి చేస్తోంది. కీలకమైన కెమెరా విషయానికి వస్తే .. ఫోన్‌ ధరతో పోలిస్తే కెమెరా పనితీరు అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. ఇక డిస్‌ప్లేలో న్యూమరిక్‌ కీ బోర్డు, పైన నాలుగు బటన్స్‌ను పొందుపర్చింది.

- Advertisement -