- Advertisement -
కేరళలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా కేసుల కట్టడికి వీకెండ్ లాక్ డౌన్, మాస్క్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయినా కేసుల సంఖ్య రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో కఠిన చర్యలు తీసుకుంటోంది సర్కార్.
ఈ నేపథ్యంలో కేరళకు సాయం అందించేందుకు ముందుకొచ్చింది రిలయన్స్. కేరళ రాష్ట్రానికి 2.5 లక్షల కోవీషీల్డ్ టీకాలను అందజేసింది. కరోనా కట్టడికి చేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రిలయన్స్ అందించిన వ్యాక్సినేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.గతంలో కేరళలో వరదలు సంభవించిన సమయంలో రిలయన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.21 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Advertisement -