ఎవరైనా….నలిగి పోవాల్సిందే

261
Rejina about dating..!

ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రెజీనా. కెరీర్ స్టార్టింగ్లో కమర్షియల్ సక్సెస్లు సాధించలేకపోయినా.. నటిగా మాత్రం మంచి మార్కులే సాధించింది. రవితేజ సరసన హీరోయిన్గా నటించిన పవర్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్న రెజీనా.. తరువాత పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జ్యో అచ్యుతానంద లాంటి హిట్ సినిమాలతో రాణిస్తోంది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా.

ఈ సందర్భంగా మాట్లాడిన రెజీనా..‘‘రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడమంత కష్టం మరొకటి ఉండదని తెలిపింది. నటనలో అనుభవం పెరుగుతోంది కానీ రొమాంటిక్‌ సన్నివేశాలు చెయ్యడానికి ఇప్పటికీ తడబడుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సన్నివేశాల్ని చెడగొట్టడంలో నా తర్వాతే ఎవరైనా అనుకుంటాను’’ అంటోంది రెజీనా.

Rejina about dating..!

తన బెడ్‌పై ఉండే తలదిండు అంటే చాలా ఇష్టమట. ‘‘అవును నాకు పిల్లో అంటే చాలా ఇష్టం. నిద్రపోయే సమయంలో అది నా పక్కనే ఉండాలి. దానిని కౌగిలించుకుని పడుకోవడమంటే ఇంకా ఇష్టం. ప్రతిరోజు తలదిండు నా కౌగిలిలో నలిగిపోవాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది రెజీనా.

డేటింగ్‌ గురించి ఆమె ముందు ప్రస్తావిస్తే ఇలా సమాధానమిచ్చింది. ‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రూమర్ల విషయంలో ఒక్కటే నమ్ముతాను. ఒకే సమాధానమిస్తాను. తెలిసీ తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడేవాళ్లు ‘మీరు చూసింది నమ్మండి.. విన్నది కాదు’’ అని సెలవిచ్చింది. రొమాన్స్ కి కాస్త దూరంగా ఉంటానంటున్న ఈ చెన్నై బ్యూటీకి బొమ్మలు, పువ్వులు అంటే అస్సలు నచ్చవట.

Rejina about dating..!