కర్ణాటక పోల్స్‌..ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్

51
- Advertisement -

దేశవ్యాప్తంగా ఆసక్తిరంగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో నిల్చున్న వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డంతో పాటు సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేసి నిఘా పెంచారు.

కన్నడ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. ద్వేషాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి పట్టం కట్టండి, అదే సమాజ అభివృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. నువ్వానేనా అన్నట్లు జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా భజరంగ్‌దళ్‌, భగవాన్ హనుమాన్ నేపథ్యంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే మత విద్వేశాలకు చెక్ పెట్టాలని కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

Also Read:ఆ దర్శకుడికి యాంకర్ శాపం

మొత్తం ఒకే దశలో 224 నియోజ‌క‌వర్గాల‌కు పోలింగ్ జరగనుండగా 2,615 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. మొత్తం 5,31,33,054 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. సీఎం బొమ్మై (బీజేపీ) శింగావ్‌ నుంచి, మాజీ సీఎంలు సిద్ధరామయ్య(కాంగ్రెస్‌) వరుణ నుంచి, శెట్టర్‌ (కాంగ్రెస్‌) హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్‌ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్‌) చెన్నపట్టణ నుంచి బరిలో నిలిచారు. మే 13న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

- Advertisement -