పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా పేరు నమోదు చేసుకోండి..

147
b vinod kumar

త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర పెన్షనర్ల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి నవనీత రావు, రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు.

సోమవారం మంత్రుల అధికారిక నివాసంలో ఆ సంఘాల నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్‌తో సమావేశమై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, అర్హులైన వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలకు చెందిన పట్టభద్రులు విధిగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.