కవిత గెలుపుతో ఎన్నారై సమాజంలో నూతన ఉత్సాహం..

105
NRI TRS

లండన్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో గెలవడంతో కేవలం ఇందూరులోనే కాకుండా యావత్ తెలంగాణ, మరియు ఎన్నారై సమాజంలో నూతన ఉత్సాహం నిండిందని ఎన్నారై టీఆర్ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.

ఎన్నారైల పక్షాన కవితకి అశోక్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు, బతుకమ్మ పండగ ముందే వచ్చినట్టు,ఇందూరులో పండగ వాతావరం నెలకొన్నట్టు స్థానిక మిత్రులు, టీఆర్ఎస్‌ శ్రేణులు తెలిపారని, కచ్చితంగా ప్రజలు ఆశించినట్టు కవిత గెలుపుతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నట్టు అశోక్ గౌడ్ దూసరి తెలిపారుఎన్నారైలతో కవిత కు ప్రత్యేక అనుభందం ఉన్నందున ఎన్నారై సమాజంమంతా కవిత గారి గెలుపు పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.