విశాల్ కు విలన్ గా రెజీనా

297
regina
- Advertisement -

తమిళ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం చక్ర సినిమాలో నటించాడు. ఈమూవీ షూటింగ్ ఇటివలే పూర్తి చేసుకోగా విడుదలకు సిద్దంగా ఉంది. ఈమూవీకి ఎం.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. నిన్న సాయంత్రం ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘చ‌క్ర‌’ ట్రైల‌ర్ విడుద‌లైంది.

కాగా ఈమూవీలో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ నటించగా..ప్రముఖ హీరోయిన్ రెజీనా విలన్ పాత్రలో నటించింది. ఈసినిమాలో రెజీనా పాత్ర కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధియేటర్లు మూసి ఉండటంతో ఈమూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -