రెజీనా హాట్‌ స్టిల్‌..వైరల్‌..!

728
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ రెజీనా కసాండ్రా ఈ సమ్మర్‌లో మరింత హీట్‌పుట్టిస్తోంది. స్విమ్ సూట్ లో హాట్‌ హాట్‌ ఫోజులిస్తూ..సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతోంది. తాజాగా తమిళ సినిమా ‘మిస్టర్ చంద్రమౌళి’ కోసం రెజీనా తమిళ యువహీరో గౌతమ్ కార్తిక్ తో రొమాంటిక్ పోజునిచ్చింది. బీచ్ లో స్విమ్ సూట్లో రెజీనా ఇచ్చిన ఫోజు ఇప్పుడు సోషల్‌మీడియాని వేడెక్కిస్తోంది.

  Regina Cassandra's hot pic with Gautham ..

తిరు డైరెక్షన్లో తెరకెక్కుతోన్నఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. అయితే ట్రైలర్ సంగతి అలా ఉంచితే..రెజీనా స్విమ్‌ సూట్ ఫోజు మాత్రం తమిళనాడు ఆవల కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగులో యంగ్‌హీరోలతో నటించిన రెజీనాకు ఇక్కడ ఆఫర్లు కరువయ్యాయి. దాంతో సొంతభాషలో ఆఫర్లను పట్టేస్తోంది రెజీనా.

అందులో భాగంగానే మిస్టర్ చంద్రమౌళిలోనూ నటించింది.ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఒకే హాట్ పోజుతో తమిళంతో పాటు తెలుగునాట కూడా రెజీనా వార్తల్లో నిలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా..ఈ సినిమాలో తమిళ సీనియర్ నటుడు కార్తిక్ ఆయన తనయుడు గౌతమ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.

- Advertisement -