ప్రతి సినిమాకి తన నటనలోని నైపుణ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటోంది హీరోయిన్ రెజీనా కసాండ్ర. ప్రస్తుతం ఆమె రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తోన్న చిత్రం `నేనే నా..?. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తోనే ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
రెజీనా కసాండ్రా పాన్-ఇండియన్ డొమైన్ అంతటా పాపులర్ అయినందున ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నిను వీడని నీడను నేనే
వంటి హిట్ తర్వాత కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి సినిమా జాంబీరెడ్డి
తో సూపర్ హిట్ సాధించిన రాజ్ శేఖర్ వర్మ తన ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రూపొందిస్తున్న వెంచర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వాటికి తగ్గట్టుగా ఈ మూవీ ట్రైలర్‌ను నిధి అగర్వాల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు స్టార్ డైరెక్టర్ లింగుసామి ఆవిష్కరించారు.
ట్రైలర్ చూస్తుంటే 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు పునరావృతమవుతోంది అని తెలుస్తోంది. రెజీనా 100 సంవత్సరాల క్రితం ఆమె రాణి అయితే ఆమె ప్రస్తుతం పురావస్తు శాస్త్రవేత్తగా ఒక రహస్యమైన కేసును పరిష్కరించడానికి వచ్చినట్టు తెలుస్తోంది.అలాగే ఈ ట్రైలర్లో అడవిలో ఏకాంత ప్రదేశంలోకి ప్రవేశించే వ్యక్తులతో పాటు, రహస్యమైన కేసును పరిష్కరించడానికి కేటాయించిన వారు కూడా చంపబడుతున్నారు. గత మరియు ప్రస్తుత కథల మధ్య లింక్ సినిమాకు కీలకం కానుంది. హర్రర్ ఎలిమెంట్స్ మరియు కామెడీతో కూడిన మిస్టరీ సబ్జెక్ట్ మూవీ ప్రేక్షకులకు తప్పకుండా సరికొత్త అనుభూతిని అందించనుంది.
కార్తీక్ రాజు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చారు. ఈ సారి కాస్టింగ్ మరియు సాంకేతిక ప్రమాణాల పరంగా ఇది భారీ ప్రాజెక్ట్.తెలుగు మరియు తమిళంలో ఏక కాలంలో రూపొందించబడిన ఈ బైలింగ్వల్ మూవీలోని కీలక సన్నివేశాలను కుర్తాళం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో చిత్రీకరించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తుండగా, గోకుల్ బెనాయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాబు ఎడిటర్ మరియు సూపర్ సుబ్బరాయన్ స్టంట్ మాస్టర్.వెన్నెల కిషోర్, అక్షరగౌడ, తాగుబోతు రమేష్, జయ ప్రకాష్ సహా మరికొంత ప్రముఖ కళాకారులు ఈ మూవీలో నటిస్తున్నారు.ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.
తారాగణం: రెజీనా కసాండ్రా, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, జయ ప్రకాష్, అక్షర గౌడ
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కార్తిక్ రాజు
నిర్మాత: రాజ్ శేఖర్ వర్మ
బ్యానర్: యాపిల్ ట్రీ స్టూడియోస్
సంగీతం: సామ్ సీ ఎస్
డీఓపి: గోకుల్ బినోయ్
ఎడిటర్: సాబు
స్టంట్స్: సూపర్ సుబ్బరాయన్
పీఆర్ఓ: వంశీ – శేఖర్