త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని…ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు కేటీఆర్.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ప్రతి కులంలో పేదవారు ఉన్నారని అలాగే రెడ్డిల్లో కూడా చాలామంది పేదలు ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న రెడ్డిలు పేరుకే అగ్రవర్ణాలు.. వీరిలో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని తెలిపారు.
రెడ్డి సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో తనకు మంత్రి పదవి వచ్చింది. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రతి కుల సంక్షేమానికి కృషి చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో కులమతాలు ఏవైనప్పటికీ.. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు.