డ్రగ్‌ కేసులో బాలీవుడ్ నటికి నోటీసులు…

179
Red Corner Notice against Mamta Kulkarni soon
- Advertisement -

బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. సోలాపూర్ లో ఎఫిడ్రిన్ పట్టివేత కేసులో ఆమెకు నోటీసులు జారీ కానున్నాయి. తన సహచరుడు విక్కీ గోస్వామితో కలసి ఆమె పలు దేశాల్లో డ్రగ్స్ దందా నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. సోలాపూర్ లోని ఏ1 లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలో ఎఫిడ్రిన్ తయారీ ముఠాతో వీరికి నేరుగా సంబంధాలు ఉన్నాయనేదానిపై సీఐడీ పక్కా ఆధారాలను సేకరించింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి సీఐడీ సమర్పించింది. ఈ నివేదికను అంతర్జాతీయ సంస్థ ఇంటర్ పోల్ కు పంపిన సీబీఐ… మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరింది. ఇది జరిగి రెండు నెలలు కావస్తోంది. అయితే, చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో నోటీసుల జారీ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడ్డాయి.

తాజాగా, సెప్టెంబర్ 29న ఆమెపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, నేడో రేపో మమతకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం మమత కెన్యాలో ఉంది. ఆమె సహచరుడు గోస్వామి అమెరికాలో అండర్ గ్రౌండ్ లో వున్నట్టు సమాచారం. గతంలో కూడా డ్రగ్స్ కేసులో మమత కెన్యాలో అరెస్టయి, విడుదలయింది. సోలాపూర్ కేసులో ఇద్దరు నైజీరియన్లు సహా 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Red Corner Notice against Mamta Kulkarni soon

ఈమె నట జీవితం, అనంతర జీవితం వివాదాల మయంగా ఉంది. స్టార్‌డస్ట్ పత్రిక ముఖచిత్రంపై టాప్‌లెస్‌గా పోజు ఇవ్వడంతో ఈమె పేరు మారుమ్రోగింది. స్టార్‌డస్ట్ పత్రిక ముఖచిత్రంపై వచ్చిన వివాదంతో కోర్టుచే అభిశంసించ బడి జరిమానా కూడా కట్టింది. కోర్టుకు హాజరు కావడానికి ఎవరూ గుర్తుపట్టాకుండా బురఖా ధరించి ఇస్లాం వర్గీయుల ఆగ్రహాన్ని చవిచూచింది. మాఫియా డాన్ ఛోటారాజన్‌ను మచ్చిక చేసుకుని సినిమా అవకాశాలు దక్కించుకుందని ఈమెపై పుకార్లు ఉన్నాయి.

సినిమాలకు స్వస్తి చెప్పాక ఈమె ఒక ఎన్.ఆర్.ఐ. వ్యాపారిని వివాహం చేసుకుని న్యూయార్కులో నివసించింది. తరువాత కొన్నాళ్లకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమై దుబాయిలో తన ఒకనాటి బాయ్ ఫ్రెండ్ విక్కీ గోస్వామితో కలిసి సహజీవనం చేస్తున్నది. విక్కీ గోస్వామికి దుబాయ్-నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేసే వ్యాపారం ఉండేది. అతనిని వివాహమాడిన అనంతరం మమతా కులకర్ణి కూడా డ్రగ్స్ కి బాగా బానిస అయ్యింది. కాగా వీరు సాగిస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం గుట్టు 2014 లో రట్టు కాగా అప్పటి థానే పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపగా అప్పటికి విక్కీ గోస్వామి పోలీస్ వారి విచారణకు సహకరించకుండా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. రెండు సంవత్సరాల పాటు విచారణ జరిపిన పోలీసులు విక్కీ గోస్వామితోపాటు మమతా కులకర్ణి పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

- Advertisement -