ఢిల్లీలోని అన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు మరియు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ఉత్తరప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయబడింది.
ఈ హెచ్చరికలు అమలులో ఉన్నంత వరకు ప్రభావిత ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారత వాతావరణ శాఖ రాబోయే రెండు నుండి మూడు గంటల కాలానికి జిల్లా వారీగా నౌకాస్ట్ (అప్పటికప్పుడు) హెచ్చరికలను విడుదల చేసింది. దిల్లీకి రెడ్ అలెర్ట్, ఉత్తరప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్‌లలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
ఆగస్టు 25 ఉదయం 7:13 గంటలకు జారీ చేసిన ఈ హెచ్చరిక ఉదయం 10:13 గంటల వరకు అమలులో ఉంటుంది. దిల్లీలో ఉరుములు, మెరుపులు, గంటకు 60 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులు మరియు గంటకు 15 మిమీ కంటే ఎక్కువ తీవ్రతతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
సెంట్రల్ దిల్లీ,ఈస్ట్ దిల్లీ,న్యూ దిల్లీ,నార్త్ దిల్లీ,నార్త్ ఈస్ట్ దిల్లీ,నార్త్ వెస్ట్ దిల్లీ,షాహ్దరా,సౌత్ దిల్లీ,సౌత్ ఈస్ట్ దిల్లీ,సౌత్ వెస్ట్ దిల్లీ,వెస్ట్ దిల్లీకి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గంటకు 60 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 15 మిమీ కంటే ఎక్కువ భారీ వర్షం కురుస్తుందని IMD హెచ్చరించింది. గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో వీచే గాలులు, ఉరుములు, మెరుపులు మరియు గంటకు 5 నుండి 15 మిమీ వరకు మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయబడింది.
Also Read:కర్ణాటకలో H1N1 విజృంభణ

