టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ- డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ”లైగర్”. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు25న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
‘లైగర్’ చిత్రానికి దాదాపు రూ.99 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇటు విజయ్ కెరీర్‌లోనూ, అటు పూరీ కెరీర్‌లోనూ ఇంత మేర బిజినెస్ జరగడమేనిది విశేషం అనే చెప్పాలి. కేవలం ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ సోనీ సంస్థ రూ.14కోట్లకు కొనుగోలు చేసింది. డిజిటల్, శాటిలైట్ హక్కుల కలిపి రూ.85కోట్లకు స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో లైగర్ చిత్రానికి రూ.70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.