సూపర్ స్టార్ నోట వైఎస్‌ఆర్‌ మాట..!

129
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్.

ఈ ట్రైల‌ర్ సినీ ఫ్యాన్స్‌ను ఎంతగానో అల‌రిస్తోంది. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం తెర‌కెక్కించిన ఈ సినిమాలో మ‌హేష్‌ ప‌లు వేరియేష‌న్ల‌తో కూడిన డైలాగ్‌లు చెప్పారు. ఇలాంటి డైలాగుల్లో ఓ డైలాగ్ అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. హీరోయిన్ కీర్తి సురేష్‌… త‌న ఎగ్జామ్ ఫీజు క‌ట్టేందుకు ఇబ్బంది ప‌డుతూ ఓ ప‌ది వేల డాల‌ర్లు సాయం చేస్తే టాప్ ర్యాంకు తెచ్చుకుంటానంటూ చెప్పిన స‌మ‌యంలో నేను విన్నాను… నేను ఉన్నాను అంటూ మ‌హేష్‌ పొలిటీషియ‌న్ మాదిరి డైలాగ్ చెబుతారు.

ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా ఉన్న స‌మ‌యంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి ప్ర‌జ‌ల క‌ష్టాలు వింటూ సాగుతున్న స‌మ‌యంలో నేను విన్నాను… నేను ఉన్నాను అంటూ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తూ సాగిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌హేష్‌ నోట ఈ మాట వినిపించడం సినిమాపై మ‌రింత‌గా అంచనాలను పెంచేసింది.

- Advertisement -