క్రికెట్‌లో అరుదైన ఫీట్..ఒకే ఓవర్లో 43 రన్స్

231
newzealand
- Advertisement -

క్రికెట్‌లో అరుదైన ఫీట్ నమోదైంది. న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ ఫోర్డ్ ట్రోఫిలో ఒకే ఓవర్‌లో 43 పరుగులు రాబట్టి నార్తన్ డిస్టిక్ ఆటగాళ్లు రికార్డు సృష్టించారు. సెంట్రల్ డిస్ట్రిక్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో నార్తన్ డిస్ట్రిక్ ఆటగాళ్లు బ్యాట్స్‌మెన్ బ్రెట్ హాంప్టన్, జో కార్టర్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతోపాటు మొత్తం 43 పరుగులు చేశారు. విలెమ్ లుడిక్ వేసిన ప్రతి బంతిని కసితీరా బాదారు.

ఈ ఓవర్లో రెండు నోబాల్స్‌ వేసిన విలెమ్‌..ఆ రెండు బాల్స్‌లో సిక్స్‌లు సమర్పించుకున్నారు. ఓవర్ ఫస్ట్ బాల్ యార్కర్ వేసినా.. అది వికెట్ల వెనుక ఫోర్ వెళ్లింది. ఆ తర్వాత రెండు ఫుల్ టాస్(నోబాల్స్‌) సిక్స్‌తో (4,6nb,6nb,6,1,6,6,6)గా మలిచి అరుదైన రికార్డు సృష్టించారు.

- Advertisement -