బ్రిటీష్ వలస పాలకుల చేతిలో దేశం విలవిల లాడుతున్న సమయంలో వారిపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన తొలితెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు కంటే ముందు బ్రిటీష్ వలస పాలకులను ఎదిరించిన విప్లవమూర్తి బ్రిటీష్ పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వీరపుత్రుడు, తొలితెలుగు స్వాతంత్యశక్తి శ్రీ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారందరూ కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ యోధుడుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్నితెలుగు ప్రజలందరూ డిమాండ్ చేయవలసిన అవసరం వుందని తమిళనాడు తెలుగుయువశక్తి అధ్యక్షుడు తెలుగు భాషా పరిరక్షణవేదిక కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు.
శనివారం ఆంధ్రప్రదేశ్ నందు గల అనంతపురం పట్టణం నందు స్థానిక క్లాక్టవర్ దగ్గర తమిళనాడు తెలుగు యువశక్తి గతంలో చేపట్టిన ఉయ్యాలవాడ చారిత్రాత్మక స్మారక యాత్రలో భాగంగా వాడవాడలా ఉయ్యాలవాడ మాట యువతకు నూతన బాట అనే నినాదంతో ఈతరం యువకులకు వారి యొక్క పోరాట పటిమను, వారి వీరగాధను తెలియజేసే ఉద్దేశ్యమే ఒక లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈరోజు ఉయ్యాలవాడను జాతీయ యోధుడిగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమం అనంతపురం పట్టణం నుండి మొదలు పెట్టారు, తమిళనాడు తెలుగుయువశక్తి అధ్యక్షుడు తెలుగు భాషా పరిరక్షణవేదిక కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ..
“తమ సంస్థ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కేంద్ర ప్రభుత్వం జాతీయ యోధుడిగా గుర్తించేవారకు ఎన్నోరకాలైన పోరాటాల ద్వారా తమ నిరసనను తెలియజేయనున్నట్లు ఒక రకంగా చెప్పవలనంటే ఉత్తరాదికి చెందిన స్వాతంత్ర్యసమరయోధులకు ఇచ్చిన గౌరవంలో దక్షిణాది ప్రాంత స్వాతంత్ర్య సమరయోధులకు ఇవ్వకపోవడంలో గత ప్రభుత్వాల తప్పిదం వున్నదని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని నిర్లక్ష్యం చేశారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని, ఆయన పుట్టిన జిల్లా అయిన కర్నూలులో కూడా తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని, నేడు మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని అని ప్రకటించే వరకు ఈ వీరుని గురించి తెలియకపోవడం చాలా బాధాకరమని, ప్రస్తుత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోది తమ సంస్థ రాసిన వినతిపత్రంలోని అంశాలను పరిగణలోనికి తీసుకోవడంతోనే సరిపెట్టుకోకుండా ప్రధాన డిమాండ్లు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జ్ఞాపకార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేయాలని, వారి వర్థంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని, పార్లమెంట్ నందు వారి విగ్రహాన్ని ప్రతిష్టించాలని, వారి జ్ఞాపకార్థం వారిని ఉరితీసిన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామంలోని జుర్రేరు వాగు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఉయ్యాలవాడ అభిమానుల కొర్కెలను ప్రభుత్వం తీర్చి తెలుగువారి గుండెల్లో ప్రధాని నరేంద్ర మోది ఒక చిరస్థాయిగా నిలవాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పై డిమాండ్ల సాధన కొరకు కృషిచేయాలని మరియు కర్నూలు జిల్లాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జిల్లాగా పేరు పెట్టేవిధంగా కృషిచేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాలను ప్రతిష్టించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ వీరుడు యొక్క కథను సినిమాగా నిర్మించడం చాలా సంతోషదాయకమని, మాకు తెలిసిన ఒక వార్త ప్రకారం ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి జన్మదినమైన ఆగష్టు 22న షూటింగ్ ప్రారంభించ బోనున్నట్లు తెలిసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడు కాబట్టి భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన దినమైన ఆగష్టు 15న ఈ చిత్రం ప్రారంభిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల యొక్క విన్నపాన్ని ఈ చిత్ర నిర్మాతలు పరిగణలోనికి తీసుకోవాలని అంతేకాకుండా మీరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కాకుండా నరసింహారెడ్డి అని టైటిల్ ను పెట్టనున్నారని తెలిసింది. తెలుగువీరుడిగా, తెలుగు జాతి గర్వించదగ్గ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రపంచానికి తెలియజేయడంలో ముందున్న మీరు కనీసం తెలుగు భాష చిత్రంలోనన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరుతో నిర్మిస్తే అప్పడే మీరు తెలుగు ప్రజలందరి గుండెల్లో చిరంజీవి పేరు చిరస్థాయిగా వుంటుందని, సహృదయంతో మెగాస్టార్ చిరంజీవి అంగీకరించాలని కేతిరెడ్డి కోరారు.