పోర్ట్‌ల్యాండ్‌లో తెలంగాణ ధూంధాం

226
TDF DoomDham at portland
- Advertisement -

అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ ఆర్గాన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్(టీడీఎఫ్‌)  ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని టీడీఎఫ్ పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఛైర్మన్ అనుమాండ్ల శ్రీని జ్యోతి ప్రజ్వాళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత సంవత్సరం ప్రారంభించిన ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతుందన్నారు. జై కిసాన్ కార్యక్రమం ద్వారా రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్న కొన్ని రైతు కుటుంబాలకు సహాయం అందించామన్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు  చేపడతామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ఆవిర్భావ వేడకుల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ ధూంధాం సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు.

- Advertisement -