తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషి మరువలేనిదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నేడు జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సీఎం. జయశంకర్ సార్ తెలంగాణ ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేశారన్నారు. చాలా మంది జయశంకర్ సార్ ను స్ఫూర్తి తీసుకొని ఉద్యమంలో పాల్గోన్నారని తెలిపారు.
తెలంగాణా రాష్ట్రం ఆయన విశేషకృషిని ఎన్నటికీ మరవదని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్బంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణా సాధన ఉద్దేశ్యం, భావజాలవ్యాప్తి కోసం ఆయన చేసిన కృషిని భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు నేతలు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ సేవలు మరువలేనివని కొనియాడారు.