ర్యాంప్‌పై పిల్లి చేసిన ‘క్యాట్‌వాక్’ చూడండి..

201
Istanbul catwalk
- Advertisement -

పిల్లి నడక అదేనండి క్యాట్‌వాక్‌. బహుశ ప్రపంచంలో క్యాట్‌వాక్ అంటే తెలియని వారు ఉండరు కావచ్చు. ఫ్యాషన్‌ షోలలో అందమైన అమ్మయిలు వయ్యారాలు పోతూ నడుస్తుంటారు. ప్రత్యేక వస్త్రధారణలో సిద్ధమైన మోడళ్లు ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేస్తుంటారు. తమ స్టైల్‌తో ఆహుతుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ నిజంగానే ర్యాంప్‌పైకి పిల్లి వచ్చి నడవడం చూశార? ఇక్కడ అదే జరిగింది.

ఇక అసలు విషయానికొస్తే.. ఇస్తాంబుల్‌లో ఇస్మోద్‌ ఇంటర్నేషనల్‌‌ ఫ్యాషన్‌ షోను నిర్వహించారు. డిజైనర్లు తయారు చేసిన దుస్తుల్లో మోడళ్లు ర్యాంప్‌పైకి వచ్చి, వెళ్తున్నారు. ఇంతలో ఓ పిల్లి అనుకోకుండా ర్యాంప్‌పైకి వచ్చింది. మోడళ్లు ఓ పక్క వస్తూ, పోతూ ఉంటే.. పిల్లి దాని పని చేస్తోంది.. మోడళ్లను పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. దాన్ని అక్కడి నుంచి పక్కకు పంపాలని ఎవరూ అనుకోలేదు. అంతేకాదు నేనేం తక్కువా అన్నట్లుగా.. ఆ పిల్లి కూడా ర్యాంప్‌పై నడుచుకుంటూ ముందుకు వచ్చేసింది. పిల్లి వేశాలకు అక్కడి వారంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -