సైనికులకు టోల్ ట్యాక్స్‌..మినహాయింపు ఉంటుందా?

12
- Advertisement -

భారత సైనికులకు టోల్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందా..అంటే భారత సైనికులకు టోల్ ట్యాక్స్ విషయంలో ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. అయితే, ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుంది. కేవలం విధి నిర్వహణలో ఉన్న సైనికులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.

Indian Tolls (Army and Air Force) Act, 1901 ప్రకారం, సైనికుడు విధి నిర్వహణలో ప్రభుత్వ వాహనంలో ప్రయాణిస్తే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే, టోల్ ప్లాజా వద్ద సైనికుడి ఐడెంటిటీ కార్డ్ మరియు డ్యూటీకి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా చూపించాలి.

సైనికులు విధి మీద కాకుండా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తే, సాధారణ పౌరుల మాదిరిగానే టోల్ చెల్లించాలి. కేవలం ఆర్మీ ఐడీ కార్డ్ చూపించడం ద్వారా మినహాయింపు పొందలేరు. ఈ నిబంధనను National Highways Fee Rules, 2008 లో స్పష్టంగా పేర్కొన్నారు.

Also Read:రోహిత్ వారసుడిగా శ్రేయాస్!

మినహాయింపు పొందడానికి అవసరమైన పత్రాలు

డ్యూటీ ఆర్డర్ లేదా ట్రాన్సిట్ పాస్

యూనిట్ అథరైజేషన్ లెటర్

సైనికుల ఐడెంటిటీ కార్డ్ (Army ID)

ఈ పత్రాలు ఉంటే, మరియు ప్రయాణం అధికారిక పనికోసం ఉంటే, టోల్ వసూలు చేయబడదు. అలాగే రిటైర్డ్ సైనికులకు మినహాయింపు లేదు. దేశంలో మొత్తం రహదారి నెట్‌వర్క్, టోల్ విధానాలు, వసూలు విధానాలు అన్నీ National Highway Authority of India (NHAI) పర్యవేక్షణలో ఉంటాయి.

- Advertisement -