కాంగ్రెస్ నేత, పాలక్కాడు ఎమ్మెల్యే , కేరళ యువజన కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మమ్కూటతిల్‌పై రచయిత హనీ భాస్కరన్ తీవ్ర ఆరోపణలు చేశారు. జూన్ 9న తాను శ్రీలంకలో ఉన్న సమయంలో రాహుల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. తన ఫొటోపై హార్ట్ ఎమోజీ పెట్టి సంభాషణ మొదలుపెట్టాడని ఆమె పేర్కొన్నారు. మొదట సాధారణంగా స్పందించినా, తరువాత అతని సందేశాల్లో ఫ్లర్ట్ స్వభావం స్పష్టమైందని తెలిపారు.
తరువాత రాహుల్ ఈ చాట్‌ను వక్రీకరించి, తననే ముందుగా సంప్రదించిందని అబద్ధం చెప్పినట్లు ఇతరుల ద్వారా తెలిసిందని హనీ ఆరోపించారు. ఇదే తరహా వేధింపులను ఇతర మహిళలు ఎదుర్కొన్నారని విన్న తర్వాత తన అనుమానాలు నిజమని అర్థమైందని పేర్కొన్నారు. మహిళలతో చాట్ చేసి, ఆ సంభాషణలను వక్రీకరించి, అశ్లీల వ్యాఖ్యలుగా మార్చి సహచరులతో పంచుకునే వ్యక్తివి నువ్వు అని హనీ మండిపడ్డారు.
నీ పార్టీ మహిళా కార్యకర్తలు ఎంత అశ్లీలతను భరించారో ఊహించుకోండి. నీతో ఏదైనా ప్రైవేట్ విషయాన్ని పంచుకున్న వారు ఇప్పుడు నిశ్శబ్ద భయంలో జీవిస్తున్నారేమో అని ఆమె వ్యాఖ్యానించారు. నీ దగ్గర ఉన్న సన్నిహిత సహచరులే నీ తీరుపై నన్ను హెచ్చరించారు. నిన్ను ప్రతిరోజూ చూసే వాళ్లు ఇలా బయట చెప్పాల్సిన స్థితి రావడం నీ అవమానానికి నిదర్శనం అన్నారు.
ఇంకా నీ రాజకీయ జీవితంలో కనీస గౌరవం మిగిలి ఉంటే, నువ్వు చేయాల్సిన ఏకైక గౌరవనీయమైన చర్య రాజకీయాలకు రాజీనామా చేయడమే. అదే నీకు మిగిలిన గౌరవం అని హనీ భాస్కరన్ స్పష్టం చేశారు.
Also Read:రోహిత్ వారసుడిగా శ్రేయాస్!

