టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్

43
RCB vs KKR

ఐపీఎల్ 14వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు తానాడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఎదురులేని ఆర్సీబీ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో డాన్ క్రిస్టియన్ స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. అటు కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

తుది జట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడికల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (WC), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (సి), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (ప), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి